కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పోలీసులు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద అందిస్తున్న సేవలు మంచి గుర్తింపునిస్తున్నాయి. ఇక్కడి పోలీసు అధికారులు చేసే విధి నిర్వహణ చూస్తే ముచ్చటేస్తుంది. జోరున వర్షం పడుతున్నా, ఎవరికైనా కష్టం అని తెలియగానే కాసేపు కూడా ఆలస్యం చేయకుండా వచ్చిన పోలీసులు తమ సేవల్ని అందిస్తున్నారు.
జోరున వర్షం లో సైతం గరికపాడు చెక్ ఫోస్ట్ సమీపంలో జరిగిన రొడ్డు ప్రమాదం గురించి తెలుసుకొని జగ్గయ్యపేట సి.ఐ చంద్రశేఖర్, చిల్లకల్లు ఎసై దుర్గాప్రసాద్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకొని భాదితులను ఆస్పత్రికి తరలించిన సంఘటన చూసిన తర్వాత మానవత్వం అంటే తెలుస్తుంది..
వర్షం వస్తోందని, ప్రమాదం జరిగినా చూడడానికి రోడ్డు మీదకు ఎవరూ రాని పరిస్థితి లో సైతం, కుటుంబాన్ని వదిలి అర్ధరాత్రి జోరున వర్షంలో తడుస్తూ కష్టంలో ఉన్న వారిని ఆదుకోవాలని వచ్చిన ఆ పోలీసు అధికారుల మానవత్వానికి, కర్తవ్య దీక్షకు హ్యాట్సాఫ్.. అధికారులు మరీ అంతగా ఒక వేళ కావాలంటే, కింద స్థాయిలో ఉన్న అధికారులను పంపించవచ్చు... పని చేయించవచ్చు. కానీ ఉన్నతాధికారి తనే ఆ సమయంలో సైతం రావడం నిజంగా గొప్ప విషయం అని స్థానికులు కొనియాడుతున్నారు.