ఏపీలోని గోదావరి జిల్లాల వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక..

ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (16:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రవాసులకు భారత వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. వచ్చే 48 గంటలల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు. అదేవిధంగా 24వ తేదీ వరకు కోస్తాలో తేలికపాటి వర్షాలు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇస్రో తెలిపింది. 
 
తెలంగాణాలో ఉదయం సమయంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో రాత్రి సమయాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. నిర్మల్, ఖమ్మం, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని గుర్తుచేసింది. 
 
ఐఎండీ శుభవార్త... 
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. వచ్చే ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎండల తీవ్ర తగ్గుతాయని పేర్కొంది. అలాగే, వడగాలులు కూడా వీచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించింది. అదేసమయంలో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని ఐఎండీ తెలిపింది. 
 
తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడివుందని, ఫలింతగా ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తాయని తెలిపింది. అనేక ప్రాంతాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు చాలా మేరకు తగ్గుతాయని పేర్కొంది. 
 
ఆంధ్రప్రదేశ్, బీహార్, దక్షిణ కర్నాటక ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన గాలి వానలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా తెలిపింది. దీంతో ఎండల తీవ్రతతో పాటు ఉక్కపోతతో తల్లడిల్లిపోతున్న దేశ ప్రజలకు కొంతమేరకు ఉపశమనం కలగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు