ఇలాంటి సైకోలను బహిరంగంగా ఉరితీస్తే తప్పు ఉండదు- వైఎస్ షర్మిల

సెల్వి

శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (15:10 IST)
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ నేత షర్మిల తీవ్రంగా స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి భార్య, వదినమ్మ వైఎస్. భారతిపై చేసిన వ్యాఖ్యలను షర్మిల ఖండించారు. 
 
ఇంకా సోషల్ మీడియా ద్వారా షర్మిల మాట్లాడుతూ.."ఇటువంటి నీచమైన వ్యాఖ్యలు ఉగ్రవాద చర్యలతో సమానం" అన్నారు. "ఇలాంటి సైకో వ్యక్తులను బహిరంగంగా ఉరితీస్తే తప్పు ఉండదు" అని అన్నారు. 
 
అవమానకరమైన ప్రకటనలు చేసే వారిపై, రేటింగ్‌ల కోసం అలాంటి వ్యక్తులను ప్రమోట్ చేసే యూట్యూబ్ ఛానెల్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. "ఒక తోటి మహిళగా ఈ అంశంపై సంకీర్ణ ప్రభుత్వం చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను" అని షర్మిల అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు