భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

ఐవీఆర్

గురువారం, 10 ఏప్రియల్ 2025 (21:16 IST)
క్షణికావేశంలో పొరబాటుగా మాట్లాడాననీ, భారతిగారు కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతానంటూ ఐటిడిపి చేబ్రోలు కిరణ్ కుమార్ ఓ వీడియో ద్వారా విజ్ఞప్తి చేసాడు. పొరబాటున, క్షణికావేశంలో తప్పుగా మాట్లాడననీ, తనను జగన్ గారు, భారతి గారు మన్నించాలంటూ ఆ వీడియో ద్వారా అభ్యర్థించాడు. ఐతే కిరణ్ చేసిన వ్యాఖ్యలపై తెదేపా సీరియస్ అయ్యింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
 
మరోవైపు కిరణ్ కుమార్ పైన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు. ఈ సమయంలో వైసిపి నాయకుడు గోరంట్ల మాధవ్ అక్కడికి చేరుకున్నారు. కిరణ్ పైన దాడి చేసేందుకు ప్రయత్నించారు. కిరణ్ అంతు చూస్తానంటూ బెదిరించారు. కిరణ్ కుమార్ ను తీసుకువెళ్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకున్న మాధవ్.. గుంటూరు వరకూ పోలీసు వాహనాన్ని వెంబడించారు. తమ విధులను అడ్డుకున్నందుకు పోలీసులు గోరంట్ల మాధవ్ ను అదుపులోకి తీసుకున్నారు.

చేబ్రోలు కిరణ్ కుమార్‌ మీద దాడి చేసిన వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి మంగళగిరి తీసుకెళ్లిన పోలీసులు

చేబ్రోలు కిరణ్ కుమార్‌ను తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డగించిన గోరంట్ల… https://t.co/kayrv6b5UP pic.twitter.com/rxvJvUZrVN

— Telugu Scribe (@TeluguScribe) April 10, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు