గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజు, గోకరాజు సోదరులు నరసింహరాజు, రామరాజు.. సోమవారం సాయంత్రం సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కాగా.. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున నర్సాపురం నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గోకరాజు గంగరాజు మొదట్నుంచి బీజేపీకి సన్నిహితంగా ఉంటూ కీలకనేతగా ఉన్నారు.