దర్శకుడు మనసులో ఏ ఐడియా వచ్చినా, దాన్ని పేపర్ మీద పెట్టినా.. తొలుత షేర్ చేసుకునేది వెన్నెల కిశోర్, దర్శకుడు సుజిత్, సమంత తోనే. ఇదే విషయాన్ని దర్శకుడు చెబుతూ.. నేను కాలేజీ రోజుల్లో వుండగా ఓ సంఘటన జరగడంతో దాన్ని పేపర్ పై పెట్టాను. దాన్ని ఓటీటీ కోసం కరోనా టైంలో ఆహా.. వారు అడిగారు. ఇచ్చాను. ఆ కథ అరవింద్ గారికి బాగా నచ్చి థియేటర్ ఫిలిం ఇది అంటూ ఆపారు. అలా 2025 దాకా సాగింది.
ఇక ముందుగా సమంతకు కథ పంపాను. తను చాలా ఎగ్జైట్ అయింది. ఇది నేను చేయాల్సిన సినిమా. కానీ పాత్రలో కొన్ని లిమిట్స్ వున్నాయి. అవి నాకు సరిపడుతుందోలేదో అని అనుమానంగా వుంది అని చెప్పింది. ఆ తర్వాత రష్మిక మందన్నాకు చెప్పడానికి ట్రై చేశాను. హిందీ లో యానిమల్ సినిమా చేస్తుంది. ఓ రోజు కథ చదివి ఈ కథ నేనే చేస్తాను. అంటూ పట్టుపట్టింది. అలా రష్మిక తెరపైకి వచ్చింది. ఈ కథలో నా అనుభవాలు, రశ్మిక అనుభావాలు కూడా వున్నాయి. కథను చదివాక తనకు బాగా కనెక్ట్ అయిందనీ, కొన్ని సంఘటనలు తనకూ జరిగాయని రష్మిక చెప్పడం విశేషం. అలా రష్మిక సినిమా చేసింది అంటూ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ వివరించారు.