తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో షార్ట్ షర్క్యూట్‌.. భయంతో పరుగులు తీసిన భక్తులు

బుధవారం, 18 మే 2016 (15:16 IST)
తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. ఈ కారణంగా ఆలయం ముందున్న కేబుల్స్ అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా దట్టమైన పొగ ఆలయాన్ని కమ్మేసింది. ఒకవైపు వర్షం కురుస్తుండంగా మరోవైపు దట్టమైన పొగ కమ్మేయడంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. 
 
వెంటనే అప్రమత్తమైన తిరుమల అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. 20 నిమిషాలకుపైగా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపన సిబ్బంది శ్రమించారు. ఆలయానికి విద్యుత్‌ సరఫరా జరిగే కేబుళ్లలో షార్ట్ షర్క్యూట్‌ వల్ల మంటలు వచ్చిన విషయం గుర్తించిన తితిదే సిబ్బంది కేబుళ్ళను సరిచేశారు. ఒక్కసారిగా మంటలు రావడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. జరిగిన సంఘటనపై తితిదే ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి