వైకాపా నేతలు మొగోళ్లు కాదా? ఆడోళ్లా? కాకపుట్టిస్తున్న శిల్పా వ్యాఖ్యలు

ఆదివారం, 6 ఆగస్టు 2017 (10:41 IST)
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైకాపా తీర్థం పుచ్చుకున్న శిల్పా చక్రపాణి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఆ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా, నంద్యాల పట్టణ మహిళల్లో వేడి పుట్టిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో ఒక్క ఓటు తగ్గినా మొగాళ్లమేకాదనీ, ఆడోళ్లమే అవుతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా.. నంద్యాల మహిళా లోకం మండిపడుతోంది. ఈ వ్యాఖ్యలపై వారు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. 
 
ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ... 2004 ఎన్నికల్లో మనకు (వైకాపా) 49 వేల మెజార్టీ వచ్చిందని... ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు తగ్గినా మనం మొగోళ్లమే కాదని, ఆడోళ్లమే కాదంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై నంద్యాల మహిళలు మండిపడుతున్నారు. శుక్రవారం రాత్రి శిల్పా మోహన్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన మహిళలు, శనివారం రోజా ప్రచారాన్ని అడ్డుకున్నారు.
 
చక్రపాణితో క్షమాపణ చెప్పించకుండానే ప్రచారానికి ఎలా వచ్చారని 16వ వార్డులోని మహిళలు ఆమెను ప్రశ్నించారు. దీంతో, పోలీసులు జోక్యం చేసుకుని, ఆమెను వైసీపీ కార్యాలయానికి పంపించేశారు. ఏదేమైనప్పటికీ చక్రపాణి వ్యాఖ్యలు నియోజకర్గంలో చర్చనీయాంశంగా మారాయి. మహిళా ఓటర్లపై ఆయన వ్యాఖ్యలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.  

వెబ్దునియా పై చదవండి