ఆంధ్రాలో ఉన్నామా.. ఆఫ్ఘన్ లో ఉన్నామా?

శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (15:06 IST)
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ఇంటిపై దాడికి దాడికి ప్రయత్నించడం వైసీపీ నేతల బరితెగింపు చర్యలకు నిదర్శనమ‌ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. గత రెండున్నరేళ్లుగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి స్పీకర్ మాట్లాడిన భాషతో పోలిస్తే,  అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు 1% కూడా లేవు. ఒక్కరోజైనా వైసీపీ నేతల భాషపై, వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పశ్చాత్తాపం వ్యక్తం చేశారా? తెలుగు రాష్ట్రాల్లోనే కాక,ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాలోకేశ్ పై వైసీపీ నేతలు అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా మాట్లాడిన తీరును అసహ్యించుకోని పౌరుడంటూ లేడు.

అయ్యన్న వ్యాఖ్యల గురించి మాట్లాడే ముందు.. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పశ్చాత్తాపం వ్యక్తం చేసి, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల‌ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండు చేశారు.
 
ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకే రాళ్లు, కర్రలతో దాడి చేసేందుకు యత్నించారంటే.. మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేక ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. ఈ ఘటన జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంటి ప్రమాదంలో ఉన్నాయో అర్ధమవుతోంది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తు నిత్యం తిరిగే ప్రాంతంలోనే ఇంతటి కిరాతక కార్యక్రమాలకు పాల్పడితే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? నిన్నటి నుండే.. దాడి చేస్తాం, తాట తీస్తాం అంటూ హెచ్చరిస్తుంటే పోలీసులు ఎందుకు స్పందించలేదు?

ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకు, అత్యాచార బాధితులకు భరోసా తెలిపేందుకు వెళ్లే వారిని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఇళ్ల నుండి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. దేవాలయాలకూ వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు.. కర్రలు, రాడ్లు, రాళ్లతో వెళ్తున్నవారిని ఎందుకు వదిలేశారు? చంద్రబాబు నాయుడి ఇంటి వద్ద జరిగిన ఘటనను వైసీపీ ప్లాన్ చేస్తే.. పోలీసులు దగ్గరుండి అమలు చేయిస్తున్నట్లుంద‌ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు