నేటి నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి నిలయం మూసివేత.. ఎందుకో తెలుసా?
శుక్రవారం, 29 జనవరి 2021 (10:11 IST)
చిత్తూరుజిల్లా కొవిడ్ సెంటర్‌గా ఎందరో బాధితులకు స్వస్థత చేకూర్చిన తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం శుక్రవారం నుంచి మూతపడనుంది. దీంతో ఇక్కడ కరోనా సేవలు రద్దు కానున్నాయి.
మార్చి చివరి వారంలో తొలుత క్వారంటైన్ కేంద్రంగా పద్మావతి నిలయాన్ని ఏర్పాటు చేసారు. మే నెలలో జిల్లా కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చారు.
తుడా కార్యదర్శి లక్ష్మి నేతృత్వంలో 250 మంది వైద్యులు, సిబ్బంది సుమారు 15 వేల మంది బాధితులకు వైద్య సేవలు అందించారు.
ప్రస్తుతం ఇక్కడున్న 15 మంది కొవిడ్ బాధితులను రుయాకు లేదా స్విమ్స్‌కు తరలించి మూత వేయనున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ పనిచేసిన వైద్యులు, అధికారులు, సిబ్బందిని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఘనంగా సన్మానించనున్నారు.