10న తిరుచానూరులో ఆన్‌లైన్ ల‌క్ష‌కుంకుమార్చ‌న‌

శనివారం, 7 నవంబరు 2020 (07:31 IST)
సిరులత‌ల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో న‌వంబ‌రు 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలను పుర‌స్క‌రించుకుని న‌వంబ‌రు 10వ తేదీన మంగ‌ళ‌వారం ఆన్‌లైన్ విధానంలో ల‌క్ష‌కుంకుమార్చ‌న ఏకాంతంగా జరుగనుంది.
 
భ‌క్తులు  త‌మ నివాస ప్రాంతాల నుండి ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారంలో వీక్షించడం ద్వారా అమ్మవారి సేవలో ప్రత్యక్షంగా పాల్గొన్నామన్న భావన కలుగుతుంది. ల‌క్ష‌కుంకుమార్చ‌న టికెట్లు న‌వంబ‌రు 6వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల నుండి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ కార్య‌క్ర‌మం న‌వంబ‌రు 10వ తేదీ ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారమవుతుంది.
 
ఈ సేవ‌లో పాల్గొనే భ‌క్తుల‌కు ఉత్త‌రీయం, ర‌విక‌, కుంకుమ‌, అక్షింతలు, రెండు ప‌సుపుదారాలు, క‌ల‌కండ ప్ర‌సాదంగా త‌పాలా శాఖ‌ ద్వారా గృహ‌స్తుల చిరునామాకు పంప‌డం జ‌రుగుతుంది.
 
టికెట్లు బుక్ చేసుకునే విధానం
- ముందుగా www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాలి.
- ఆన్‌లైన్ ల‌క్ష‌కుంకుమార్చ‌న‌ (వర్చువల్ పార్టిసిపేషన్) అనే బటన్ క్లిక్ చేయాలి.
- ఇక్కడ టిటిడి పొందుపరిచిన సూచనలను అంగీకరిస్తూ I Agree అనే బాక్స్ లో టిక్ గుర్తు పెట్టాలి.
- ఆ తర్వాత గృహస్తుల(ఇద్దరు) పేర్లు, వయసు, లింగం, గోత్రం, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ప్రసాదాలు పంపిణీ కోసం చిరునామా వివరాలు పొందుపరచాలి.
- ఈ సమాచారాన్ని సరిచూసుకొని కంటిన్యూ అనే బటన్ నొక్కితే పేమెంట్ పేజి వస్తుంది.
- ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా సదరు టికెట్ మొత్తాన్ని చెల్లించవచ్చు.
- పేమెంట్ పూర్తయిన అనంతరం టికెట్ ఖరారవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు