ఏపీ పోలీస్ కస్టడీలో ఉన్న వైసీపి వివాదాస్పద నాయకుడు బోరుగడ్డ అనిల్ వ్యవహారంపై ఇప్పటికే శ్రీరెడ్డి పలు సందర్భాల్లో స్పందించారు. బోరుగడ్డ వ్యవహారంపై తాను గతంలో వైసీపి పెద్దలకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసానని శ్రీరెడ్డి స్పష్టం చేసారు.
అనిల్ వల్ల పార్టీకి తీరని నష్టం కలగబోతుందని చెప్పిరా ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. సీఎం, డీసీఎం, మంత్రులపై, డీసీఎం కుమార్తెలపై దురుసుగా మాట్లాడటం తప్పేనని.. అందుకే తగిన బుద్ధి చెప్పారని శ్రీరెడ్డి తెలిపారు. రాజకీయాలు అంటే కక్ష్యా పూర్వకంగా వుంటాయి.
రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో ఇవి సహజమే. అధికారంలోకి వచ్చిన పార్టీలు కక్ష్య సాధింపు కోసం కేసులు పెట్టడం మామూలే. ఇవన్నీ పలు కారణాల కోసం చేయొచ్చు. బోరుగడ్డ విషయంలో వైకాపాకు వార్నింగ్ ఇచ్చానని శ్రీరెడ్డి తెలిపింది.
రేప్ అనే పదాన్ని వాడితేనే బోరుగడ్డను అరెస్ట్ చేసి సరిగ్గా బుద్ధి చెప్పారని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. పబ్లిక్‌గా ఆడపిల్లలపై అలాంటి వార్నింగ్ ఇవ్వడం చూస్తే భయం తప్పదని ఆమె వెల్లడించింది. అయితే తెనాలిలో వాడు టీడీపీనో, జనసేననో ఇతర ఏ పార్టీ కార్యకర్తనో కానీ రాజకీయాల్లో ఏమన్నా మాట్లాడుకోండి. కానీ అతను ఓ అమ్మాయిని నెత్తిమీద కొట్టి కోమాలోకి వెళ్లేలా చేశాడు.
అలాగే చిన్నపాపను చంపేసి చెరువులో పడేశాడు. ఆ అమ్మాయి శవం కూడా మొన్నటి వరకు దొరకలేదు. ఇంకా కడపలో ఓ అమ్మాయిని అడవిలో రేప్ చేసి కాల్చేశారు. ఈ అందరికీ ఎలాంటి శిక్షలేస్తారని శ్రీరెడ్డి ప్రశ్నించింది. వారం క్రితం విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాను చూశానని ఆ సినిమాలో రజనీకాంత్ తీసుకున్న సబ్జెక్ట్‌కు హ్యాట్సాఫ్ అని.. ఎలాగో తెలుగు హీరోలు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోరనే విషయాన్ని పక్కనబెడితే.. రజనీ సినిమాలో ఓ మాఫియాకు అడ్డుగా వుందని ఓ అమ్మాయిని చంపేస్తే.. ఆ అమ్మాయి కోసం హీరో చేసే సాహసాలు.. మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిని ఎలా ఎన్ కౌంటర్ చేయాలి.. ఏ విధంగా ఎన్‌కౌంటర్ చేస్తే తప్పు లేదని చూపించారు. ఆ సినిమా తనకు బాగా నచ్చిందని శ్రీరెడ్డి అన్నారు. హీరోలుగా ఇలాంటి సినిమాలు మీరు ఎంచుకోకపోయినా.. హీరోగా వుండి.. ప్రస్తుతం డీసీఎంగా వున్న పవన్ కల్యాణ్ రియల్ హీరోగా వున్నారు కాబట్టి.. దయచేసి ఇలాంటి ఆడపిల్లలకు న్యాయం చేయండని శ్రీరెడ్డి విజ్ఞప్తి చేశారు.
మీ ఇంటి ఆడపిల్లను అంటే బోరుగడ్డను బొక్కలు ఇరగ్గొడుతున్నారంటే.. ఇప్పుడు ఆంధ్రాలో ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలున్నారు. మీరు రియల్ హీరో అనిపించుకోవాలనుకుంటే.. ఎన్నికల ముందు ఆడపిల్లలను కాపాడుతానని, ఏపీని సేవ్ చేస్తానని ఆవేశంతో మాట్లాడారు... ఆడపిల్లలపై అక్కాచెల్లెల్లు, వీర మహిళలని, చేగువేరా మాటలతో ప్రసంగాలు చేశారు.
ఈ రోజు ప్రజల తరపు నుంచి మహిళా లోకం నుంచి ఆడపిల్లలు, స్టూడెంట్స్ తరపు నుంచి ఏపీ హోం మంత్రి అనితకు లేకుంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తాను విజ్ఞప్తి చేసేదేంటంటే.. ఆడపిల్లలపై అకృత్యాలకు పాల్పడే వారిపై కఠిన శిక్ష పడాలని అర్థిస్తున్నానన్నారు.
బోరు గడ్డ లం .. కొడుకు ,రేప్ అని వార్నింగ్ ఇస్తేనే ,తాట తీశారు ,గుడ్ ..మరి వీళ్లనేం చేద్దాం ??atleast dcm didnt even time to tweet??be responsible sir pic.twitter.com/knj9I1WoCL