ఏపీ ఎక్సైజ్‌ శాఖలో సమ్మెలు నిషేధం

సోమవారం, 19 ఆగస్టు 2019 (19:34 IST)
ఆంధ్రప్రదేశ్‌ ఎక్సైజ్‌ శాఖలో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. 
 
రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో ఏపీ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఆధ్వర్యంలో దుకాణాలు రానున్న విషయం తెలిసిందే. 
 
ఈ మేరకు రిటైల్‌ దుకాణాల నిర్వహణను ఆ సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సమ్మె నిషేధ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు