పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థినిపై మనసుపడి, ఆమె ఫోన్ నంబరు కావాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారంతా వచ్చి ఇన్విజిలేటర్‌కు దేహశుద్ధి చేశారు.
ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని తిమ్మాపూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పిరశీలిస్తే, తిమ్మాపూర్‌లో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ వుంది. ఇక్కడ ఓ విద్యార్థిని బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈమె సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు మరో ఇంజినీరింగ్ కాలేజీకి వెళ్లింది.
అప్పుడే ఎదురుతిరిగి నాలుగు వాయిద్దామని ఆ విద్యార్థిని ఆలోచించినా, తన పరీక్షకు ఆటంకం కలుగుతుందని మిన్నకుండిపోయింది. పరీక్ష అనంతరం తాను చదివే కాలేజికి వెళ్లి, వెంకటేశ్ ప్రవర్తనపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కాలేజ్ సిబ్బంది, వెంకటేశ్‌ను పిలిపించారు.
ఎందుకలా చేశావని అడిగితే, తనకు ఆ అమ్మాయి నచ్చిందని, అందుకే ఫోన్ నంబర్ అడిగానని చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు అతన్ని చితక్కొట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.