ఆశాలకు 6 నెలలుగా బకాయి పడిన వేతనాలు, పారితోషికాలు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేలు పారితోషికాలతో ముడి పెట్టకుండా గౌరవ వేతనంగానే ఇవ్వాలని, జీ.ఓ.వెంటనే విడుదల చేయాలని, రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపాలని తదితర డిమాండ్లపై జరిగిన ధర్నాలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆశాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆశా వర్కర్ల యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు వై.నాగలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ధనశ్రీ, ప్రధాన కార్యదర్శి ఎం.కమల, సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్.బాబూరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఎ.వెంకటేశ్వరరావు, ఎన్.సిహెచ్.శ్రీనివాస్, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం సంఘాలు జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రజ తదితరులు పాల్గొన్నారు.