తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇపుడు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆయన సోషల్ మీడియా వేదికగా తన మనసులోని విషయాలను బహిర్గతం చేస్తున్నాడు.
ముఖ్యంగా, విజయవాడ ఎంపీ కేశినేని నాని తన అసంతృప్తిని ట్విట్టర్ వేదికగా బయటపెడుతుండటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల టీడీపీలో షో మ్యాన్‌లు అవసరం లేదంటూ నాని వ్యాఖ్యానించి కలకలంరేపారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్.. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ను ఉద్దేశించి చేసినవై ఉంటాయని పలువురు చర్చించుకుంటున్నారు.