నాడు టీడీపీ మంత్రులపై తనదైన శైలిలో విమర్శలు చేసి హాట్ టాపిక్ అయిన రాష్ట్ర మహిళా నేత సుధారాణి ఇపుడు వైకాపా సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. మూడు రాజధానులు కాదనీ, రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, నాడు జరిగిన అవమానం భరించలేక నాడు టీడీపీ సర్కారుపై బహిరంగ వ్యాఖ్యలు చేసి, నాడు వైసీపీకి మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. మళ్ళీ అదేవిధంగా నేటి సర్కారు నిర్ణయం తీసుకుందనే మళ్ళీ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వచ్చాను అని తెలిపారు.
మంత్రి స్థాయిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు సమజసం కాదు. అదే సమయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేయిడ్ ఆర్టిస్టులంటు రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. దీనిపై వెంటనే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. పాలనపై పట్టు లేకపోవడంతోనే ఇన్ని ఇబ్బందులు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే స్పష్టం అవుతుంది. తమ అవసరాలకు అనుగుణంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే తగిన మూల్యం తప్పదు అని ఆమె జోస్యం చెప్పారు.