ఏప్రిల్ 24వ తేదీ నుంచి తెలంగాణాలో స్కూల్స్ సెలవు

గురువారం, 31 మార్చి 2022 (10:11 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 24వ తేదీ నుంచి పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. ఏప్రిల్ 7 నుంచి 9వ తరగతులకు చెందిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, 23వ తేదీన పరీక్షా ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ తర్వాత 24వ తేదీ నుంచి స్కూల్స్ సెలవులు ఇవ్వనున్నారు. 
 
నిజానికి మే నెలలో పదో తరగతి విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు ముగిసిన త‌ర్వాత వేస‌వి సెల‌వులు ఇచ్చేలా కార్యాచ‌ర‌ణ రూపొందినా.. రోజురోజుకీ ఎండ వేడిమి పెరిగిపోతున్న‌ నేప‌థ్యంలో ఏప్రిల్ 24 నుంచే పాఠ‌శాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం బుధ‌వారం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు తెలంగాణ పాఠ‌శాల విద్యాశాఖ బుధ‌వారం రాత్రి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.
 
ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ఏప్రిల్ 7 నుంచే 1 నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప‌రీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ప‌రీక్షా ఫ‌లితాల‌ను 23లోగా విడుద‌ల చేయ‌నున్నారు. ఆ మ‌రునాటి నుంచే అంటే.. ఏప్రిల్ 24 నుంచే వేస‌వి సెల‌వులు మొద‌లు కానున్నాయి. 
 
భారీగా పెరిగిన ఎండ వేడిమి నేపథ్యంలో ఇప్ప‌టికే మొద‌లైన ఒంటిపూట బ‌డుల‌ను కూడా గురువారం నుంచి ఉద‌యం 11.30 గంట‌ల‌కే ముగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఆ వెంట‌నే వేస‌వి సెల‌వుల‌పైనా ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు