అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన పేదలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కేంద్రం కల్పించడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సమర్థించింది. వీరికి పది శాతం కోటాను కల్పించడం రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్టు కాదని విస్తృత ధర్మాసనం అభిప్రాయపడింది. పైగా, ఈ నిర్ణయంలో ఎలాంటి వివక్షా లేదని స్పష్టం చేసింది.
కాగా, గత 2019 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను తీసుకొచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యా సంస్థల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు కాగా, తుది తీర్పును సోమవారం వెల్లడైంది.