నాలుగేళ్లుగా విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదు : సుప్రీంకోర్టు

సోమవారం, 2 ఏప్రియల్ 2018 (12:32 IST)
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నాలుగేళ్ళుగా ఏపీ విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టీస్ సిక్రీ సారథ్యంలోని ధర్మాసనం ప్రశ్నించింది.
 
ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయలేదని పేర్కొంటు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన ధర్మాసనం... నాలుగేళ్లు గడిచిపోయినా విభజన చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 
 
దీనికి సమాధానం ఇవ్వడానికి తమకు నాలుగు వారాల గడువు కావాలని కోర్టును కేంద్రం కోరింది. దీంతో, నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు