అనంతపురం జిల్లాలో డ్రైవింగ్ లైసెన్స్, ఎల్‌ఎల్‌ఆర్‌ల పరీక్షలు ఈనెల 10వ తేదీ వరకు నిలిపివేయనున్నట్లు డీటీసీ శివరాంప్రసాద్ పేర్కొన్నారు. ఇదివరకు ఏప్రిల్ మూడోవారం నుంచి గతనెలాఖరు వరకు డీఎల్, ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షలు నిలుపుదల చేశామన్నారు.
ప్రభుత్వం ఈనెల 10వతేదీ వరకు కర్ఫ్యూను పొడిగించడంతో అప్పటిదాకా డ్రైవింగ్ లైసెన్స్, ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షల నిర్వహణ ఉండదన్నారు. ఇదివరకే డీఎల్, ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షల కోసం స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులు నిర్దేశించిన తేదీ తర్వాత తిరిగి కొత్త తేదీకి బుక్ చేసుకోవాలని సూచించారు.
7లోపు వాహనమిత్రకు దరఖాస్తు చేసుకోండి
వైఎ్‌సఆర్ వాహనమిత్ర పథకానికి అర్హులైన వాహన యజమానులు ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డీటీసీ శివరాంప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని స్థానిక వార్డు, గ్రామ సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించి, అక్కడే తిరిగి అందించాలన్నారు.
గతేడాది లబ్ధిదారులతోపాటు తాజాగా దరఖాస్తు చేసుకునే ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్ యజమానుల్లో అర్హులైన వారికి రూ.10వేల చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఈనెల 15వ తేదీన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వాహన మిత్ర డబ్బు విడుదల చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని వాహన యజమానులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.