తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు స్తంభించాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం శుక్రవారం నుంచి సుమారు 15 వేల మంది డాక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. అయితే, అత్యవసర, జనరల్ వార్డులకు మాత్రమే డాక్టర్లు అందుబాటులో ఉంటారని ప్రభుత్వ డాక్టర్ల సమాఖ్య వెల్లడించింది.
ఔట్ పేషెంట్లు, ఇతర ఇన్ పేషెంట్ వార్డులకు సేవలు ఉండవన్నారు. అయితే ప్రభుత్వ డాక్టర్లకు సంబంధించిన మరో సంఘం మాత్రం తాము రెండు రోజులు మాత్రమే సమ్మెలో పాల్గొననున్నట్లు స్పష్టం చేసింది. క్రమక్రమంగా ప్రమోషన్లు ఇవ్వాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.