కోడలు, మనవళ్లు ఉన్నా.. గొడవల కారణంగా పట్టించుకోలేదు. దాంతో అజ్జప్ప మానసికంగా కృంగిపోయాడు. ఊరు వదలి వెళ్లిపోయి దేవాలయాలు, పాడుబడ్డ భవనాల్లో నివసిస్తూ ఉండేవాడు. ఐతే నాలుగు రోజులుగా అతడు కనిపించడం లేదు. ఈ క్రమంలో గొరవెహళ్ల అటవీ ప్రాంతంలో సగం కాలిన వృద్ధుడి శవాన్ని గుర్తించిన గొర్రెల కాపర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాలిన మృతదేహం అజ్జప్పదని తేల్చారు.