పీకలేకపోయిన పవన్ పార్టీలో చేరతానా? తమ్మినేని సీతారాం (Video)

ఠాగూర్

సోమవారం, 30 డిశెంబరు 2024 (10:31 IST)
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైకాపా నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం పార్టీ మారబోతున్నట్టు ప్రచారం సాగుతుంది. దీనిపై తమ్మినేని సీతారాం స్పందించారు. పీకలేకపోయిన పవన్ పార్టీలో చేరతానా? నా కొడుక్కి బాగోలేకపోవడం వల్లనే వైసీపీకి దూరంగా ఉంటున్నట్టు చెప్పారు.
 
కాగా, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవలే తమ్మినే సీతారాంకు ఇచ్చిన పార్టీ ఇన్‌చార్జ్ పదవిని కూడా పీకేశారు. దీంతో తమ్మినేని జనసేనలోకి వెళ్లేందుకు చర్చలు జరిపారంటూ ఆముదాలవలసలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ ఆయన కుమారుడుని పరామర్శించేందుకు వచ్చి బుజ్జగించినట్లుగా తెలుస్తోంది. 
 
ఇదే అంశాన్ని తమ్మినేని సీతారాం వద్ద మీడియా ప్రస్తావించారు. దీనిపై తమ్మినేని స్పందిస్తూ, తన కుమారుడుకి ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్ళడం వల్ల నెల నుంచి నెలన్నర రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పారు. 
 
బొత్స సత్యనారాయణ కలిసిన అంశాన్ని తీసుకుని ఇలా మాట్లాడటం ఏమాత్రం సబబు కాదన్నారు. ఫోటో ఆధారంగా వార్తలను సృష్టించడం మీడియాతో సబబు కాదని తమ్మినేని సీతారాం హితవు పలికారు. 


 

పీకలేకపోయిన పవన్ పార్టీలో చేరతానా? నా కొడుక్కి బాగోలేకపోవడం వల్లనే వైసీపీకి దూరంగా ఉన్నా: తమ్మినేని సీతారాం

ఇంచార్జ్ పదవిని కూడా జగన్ పీకేయడంతో తమ్మినేని సీతారం జనసేనలోకి వెళ్లేందుకు చర్చలు జరిపారని ఆముదాలవలసలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ ఆయన… pic.twitter.com/dA1hbMjj1r

— Telugu360 (@Telugu360) December 30, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు