ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసింది నేరం కాదు.. ఆయనకి తెలియకుండా జరిగిందని బీజేపీ నాయకురాలు, నటి మాధవీలత అన్నారు. అంతేకాదు, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ చేసింది నేరం కాదని, సరైన సమయంలో ఆయన స్పందించకపోవడమే చేసిన పొరపాటన్నారు. తప్పునకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉందని ఆమె ఓ వీడియోను ఆమె విడుదల చేశారు.