జూమ్‌ పార్టీలా టీడీపీ: మంత్రి బొత్స

గురువారం, 14 మే 2020 (17:29 IST)
రాష్ట్రంలో వ్యవస్థలను చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని,  టీడీపీ ఇప్పుడు జూమ్‌ పార్టీలా మారిందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

ఎల్జీ పాలిమర్స్‌ ఘటనలో ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతుంటే.. ఒక్క టీడీపీ నేత కూడా సహాయం  చేయలేదని మండిపడ్డారు. 

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ఎల్జీ పాలిమర్స్ సంఘటన  జరగగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్ తక్షణమే విశాఖకు వచ్చి బాధితులను పరామర్శించి, వారికి భరోసా ఇచ్చారు.మంత్రులను ఇక్కడే ఉంచి పర్యవేక్షించమని ఆదేశాలు ఇచ్చారు.ఎప్పటికప్పుడు పరిణామాలను పరిశీలిస్తున్నారు.
 
చనిపోయిన కుటుంబాలకు పరిహారంగాని,చికిత్స పొందుతున్నవారికి ఆర్ధికసహాయం,బాధితుల ఆరోగ్యానికి సంబంధించి  చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి కార్యాచరణప్రణాళిక రూపొందించి మంత్రులతో మాట్లాడుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
 
ఆ ప్రాంతంలో సాంకేతికపరంగా అధికారుల సూచనల మేరకు విషవాయువు తీవ్రత తగ్గి, అక్కడ ఇబ్బందిలేదని నిర్ధారించాక  ప్రజలను ఆ గ్రామాలకు  తీసుకువెళ్లడం జరిగింది. రెండురోజులుగా బాధిత గ్రామాలలో సాధారణ స్దితి ఉంది.అక్కడివారికి ధైర్యం ఇచ్చేందుకు మంత్రులు,అధికారులు కూడా అక్కడే బసచేయడం జరిగింది.
 
ముఖ్యమంత్రిగారు మొదటిరోజున పరిహారానికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలమేరకు బాధితులకు సహాయాన్ని అందించాం.బాధిత గ్రామాలలో పరిస్ధితులను వైయస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో సహాయచర్యలు కొనసాగుతున్నాయి.
 
గ్రామాలలో పర్యటిస్తున్నప్పుడు ఐదు గ్రామాలలోనే కాక ఫ్యాక్టరీ గోడ పక్కనే ఉన్న వారికి కూడా ముఖ్యమంత్రిగారు ప్రకటించిన సహాయం అందించాలని ప్రజలు కోరారు.దానిని ముఖ్యమంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లి వారి విజ్ఞాపనలు కూడా పరిగణనలోనికి తీసుకోవడం జరిగింది.
 
రేపటితో గ్రామాల్లో సర్వే పూర్తవుతుంది.గ్రామాలలోని ఇళ్లల్లో సరుకులు తినేందుకు ఉపయోగించకూడదని,ఆహారం వండుకునేందుకు ఇబ్బందులు ఉన్నందున..... నిపుణులు చెప్పిన నేపధ్యంలో పరిహారం ఇచ్చేవరకు కూడా భోజన ఏర్పాట్లు కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.
 
ప్రమాదంలో బాధితులుగా మారిన ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదని ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తోంది.వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాబోయేకాలంలో ఏవిధమైన ఆరోగ్యసమస్యలు వచ్చినా పూర్తిగా బాధ్యత వహించేలా కార్యక్రమాన్ని రూపొందించాం.
 
ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్షనేతగాని,ప్రతిపక్షపార్టీలు వారికి వత్తాసు పలుకుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు,ఛానల్స్ ఇష్టారాజ్యంగా వారి రాతలు వారు రాస్తూనే ఉన్నారు. రాస్తే రాసుకోనీయండి....అది వారి కర్మ. వారి బుర్రలను మార్చలేం.వాస్తవాలను వక్రీకరిస్తున్నారు.

టిడిపి పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది.రైల్వేలోకోపైలట్ ,డ్రైవర్  అస్వస్ధతకు గురయ్యారని వారే స్వయంగా  చెబితే....అస్వస్ధతకు గురికాలేదని బొత్స చెబుతున్నారని ఈనాడులో రాశారు.పత్రికలో వచ్చింది జరగలేదని నేను అబధ్దం చెప్పలేదు.
 
ఈ సంఘటన ఏ రోజైతే విషవాయువు వెలువడిందో ఆరోజు జరిగింది.కాని ఈనాడు పత్రికలో వచ్చింది మంటే....నిజానికి శుక్రవారం తెల్లవారుజామున వారికి అలా జరిగితే శనివారం జరిగిందని ఆదివారంనాటి పత్రికలో రాశారు.

నేను చెప్పింది అది. అంటే రెండురోజుల తర్వాత కూడా ఇంకా ఈ ప్రాంతంలో విషవాయువులు ఉన్నాయి.రైళ్లు కూడా తిరగడంలేదు.అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా తప్పుడు రిపోర్టింగ్ చేస్తున్నారని నేను చెప్పాను.
 
గ్యాస్ వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారందరికి,విశాఖప్రజలందరికి కూడా తెలుసు.ప్రాణనష్టం పెద్దగా జరగకుండా ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయిందో...ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉందో ....ఏవిధంగా ఆదుకుందో అందరికి తెలుసు.
 
స్టైరిన్ గ్యాస్ ఒక్క టన్ను కూడా అక్కడ ఉండటానికి వీల్లేదని ముఖ్యమంత్రి స్పష్టంగా  చెప్పారు. ముఖ్యమంత్రిగారు ఎల్జీపాలిమర్స్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన విషయాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారు.అందరి ఎదుట కంపెనీ ప్రతినిధులతో మాట్లాడిన మాటలను టిడిపి నాయకులు తప్పుగా దుష్ప్రచారం చేయడం వాటిని టివిలలో ప్రసారం చేయడం బాధనిపిస్తోంది.
 
మేం బ్రహ్మాండంగా పని చేశామని మమ్మల్ని పొగడక్కర్లేదుగాని, జరిగిన వాస్తవాలు చెప్పాలి.తెలుగుదేశం పార్టీ ఏమైపోయిందంటే రాష్ర్ట ప్రతిపక్షపార్టీ కాదు జూమ్ పార్టీ అయిపోయింది.టిడిపి నేతలు ప్రజలదగ్గరకు రారు.సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లరు.కరోనా వస్తే దోచుకున్నదాన్ని సహాయం చేయడానికి ఒక్క రూపాయి కూడా తీయరు.
 
చంద్రబాబు వ్వవస్ధలను భ్రష్టుపట్టించాడు.ఎల్జీపాలిమర్స్ సంఘటన చాలాదురదృష్టకరం,బాధాకరమైనది.ఇదే చంద్రబాబు హాయంలో అయితే ఎంత బ్లోఅప్ చేసి ఆయన లేకపోతే ఏదోజరిగిపోయేదని చెప్పుకునేవారు. మా ముఖ్యమంత్రిగారు చక్కగా ఎవరికి ఇబ్బంది లేకుండా అధికారులకు ఆదేశాలు ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.
 
ఐదురోజులలో సమస్యను నార్మల్ స్టేజ్ కి తీసుకువచ్చారు.అదే టిడిపి ఉంటే 50 రోజులు పట్టేది.ఎందుకంటే వారికి కావాల్సింది పబ్లిసిటీ. వైయస్ జగన్ గారికి పబ్లిసిటి కాదు.రిజల్ట్స్ కావాలి.టైం బవుండ్ లో పరిష్కారం జరిగిపోవాలనే దిశగా పనిచేస్తారు.

కరోనా విషయంలో ముఖ్యమంత్రి కరోనాతో సహజీవనం చేయాల్సివస్తుందని మొదటిరోజునే చెప్పారు.దానిపై టిడిపి వాళ్లంతా ఏ రకంగా మాట్లాడారంటే.....కరోనాను ఈజీగా చూస్తున్నారని విమర్శలు చేశారు.
 
ఈరోజు అందరూ ముఖ్యమంత్రులు.భారతదేశప్రధాని కూడా అదే చెబుతున్నారు.చంద్రబాబు అండ్ కో ఏం చూస్తుందంటే జగన్ ఏం మాట్లాడినా కూడా ఏదో విధంగా తప్పుపట్టి, కించపరిచేలాగా విమర్సలు చేసి రాజకీయలబ్దిపొందాలని చూస్తున్నారు.
 
ప్రతిరోజూ కరోనాపై ముఖ్యమంత్ర సమీక్షచేస్తున్నారు.వైద్యనిపుణులందరితో కూర్చుని తెలుసుకుంటారు.క్షేత్రస్దాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుని ఆ తర్వాత దానిపై జగన్ మాట్లాడతారు. చంద్రబాబు ఎవరో స్లిప్ ఇస్తే దానినే మాట్లాడతారు.జగన్ అలా కాదు.

జగన్ విధానాలు  తెలియక చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపధ్యంలో రైతులు,వ్యవసాయం గురించి ముందుగా స్పందించి నిర్ణయాలు తీసుకుంది ఆంధ్రరాష్ర్టమే" అని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు