ఆంధ్రాలో పంట అమ్మకానికి అడ్డంకులు.. స్వేచ్ఛగా మద్యం విక్రయాలు

బుధవారం, 6 మే 2020 (13:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు స్వేచ్ఛగా సాగుతున్నాయి. కానీ, రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు మాత్రం అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు. ఫలితంగా పలు ప్రాంతాల్లో రైతులు తాము పండించిన పంటను రోడ్లపైకి తెచ్చి పారబోస్తున్నారు. ఈ దారుణం కడప జిల్లా గొల్లపల్లి గ్రామంలో జరిగింది. 
 
ఈ విషయాన్ని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. "రైతు తన పంటను మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించలేకపోతోంది. కడపజిల్లా, గొల్లపల్లి గ్రామంలో తాము కష్టపడి పండించిన కూరగాయలను రైతులు నడిరోడ్డుపైనే పారబోశారంటే ఎంత బాధాకరమైన విషయం! మద్యం అమ్మకాలకి అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా? ఏమిటీ దారుణం?" అంటూ నిలదీశారు. ఆ వీడియోను మీరూ చూడండి. 

 

రైతు తన పంటను మార్కెట్లో అమ్ముకునే పరిస్థితులను ప్రభుత్వం కల్పించలేకపోతోంది. కడపజిల్లా, గొల్లపల్లి గ్రామంలో తాము కష్టపడి పండించిన కూరగాయలను రైతులు నడిరోడ్డుపైనే పారబోశారంటే ఎంత బాధాకరమైన విషయం! మద్యం అమ్మకాలకి అడ్డురాని నిబంధనలు పంట అమ్మకానికి అడ్డొస్తున్నాయా? ఏమిటీ దారుణం? pic.twitter.com/WYdoqTVVIq

— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) May 6, 2020

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు