నీకు మహిళల చేతిలో బడితెపూజ ఖాయం: వంగ‌ల‌పూడి అనిత

బుధవారం, 9 మార్చి 2022 (21:10 IST)
Anita
వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు టీడీపీ మ‌హిళా విభాగం తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత. త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం ఆప‌క‌పోతే.. ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి మ‌రీ ఆయ‌న తాట తీస్తాన‌ని ఆమె ఘాటు వ్యాఖ్య‌ల‌తో విరుచుకుప‌డ్డారు.
 
టీడీపీ నేత చంద్ర‌బాబు సీఎం కాగానే.. వైసీపీ నేత‌ల ఇళ్ల‌కు వెళ్లి వారికి బ‌డిత పూజ చేస్తామ‌ని అనిత మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌లోని త‌న ఇంటిని ఎవ‌రికి రాసిచ్చారో ద‌మ్ముంటే చెప్పాల‌ని ఆమె స‌వాల్ విసిరారు.
 
తన క్యారెక్టర్ గురించి మాట్లాడితే ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి చరిత్ర మొత్తం మీడియా ముందు పెడ‌తానంటూ అనిత హెచ్చ‌రించారు. ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి మాట‌ల‌కు, బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేదని ఆమె తేల్చి చెప్పారు. ప్రసన్నకుమార్ రెడ్డి నీ భాషని భారతి రెడ్డి మెచ్చుకుంటుందా? అంటూ ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు