సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపింది. టీడీపీ నేతలు కొందరు పవన్‌కు మద్దతు పలికితే.. మరికొందరు పవన్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
పవన్ ఇప్పటికైనా తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కల్యాణ్ కుంభకర్ణుడిలా నిద్రపోయారని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు తమిళనాడులో చేస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత కాళ్లు, చేతులు విరగ్గొట్టించేవారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.