ఏపీలో జరిగిన గ్రామ పంచాయతీ, పురపాలక ఎన్నికల తీరుపై టీడీపీ నేత జలీల్ ఖాన్ మండిపడ్డారు. ఇవీ ఓ ఎన్నికలేనా అంటూ ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, గత 32 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి, గత పంచాయితీ ఎన్నికలు ఎప్పుడూ చూడలేదన్నారు.
అవినీతిపరుడైన మంత్రి ఇంటి ముందు షాడో పార్టీ పెట్టాలి కాని, నా ఇంటి ముందు ఎందుకు టిడిపి నేతలు ఎక్కడా తిరగకూడదంటా. కాని వైసిపి నేతలు, చిల్లర నేతలు బూత్‌ల వద్ద రౌడీయిజం చేశారు.
వైసిపి నేతలు నిన్న మధ్యాహ్నం నుంచి డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. రాష్ట్రంలో ఓటింగ్ శాతం తక్కువ కావడానికి కారణం పోలీసులే. అధికార పార్టీకి గులాం గా పోలీసులు వ్యవహరించారు. వైసిపి నేతలు ప్రలోభాలకుగురి చేసినా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు లో ప్రజలు స్వచ్చందంగా ఓట్లు వేసేందుకు వచ్చారు
దుర్గగుడిలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వైసిపిలో కార్పొరేషన్ లో సీట్లిచ్చిన వారంతా దొంగలు, రౌడీ షీటర్లే చంద్రబాబును విమర్శించే స్ధాయి వెలంపల్లికి లేదు. చంద్రబాబు ఇంట్లో పాచిపని చేసుకొనే వ్యక్తి స్థాయి వెలంపల్లిది.
త్వరలోనే డిజిపి, ఎన్నికల అధికారులను కలుస్తా. వన్టౌన్, కొత్తపేట సిఐలు, ఎసిపిని మార్చాలని కోరతా. పోలీసు వ్యవస్ధ సీరియస్‌గా ఉంటే వైసిపి ఖతం అవుతుంది. పోలీసులు సాదాసీదాగా ఉండడం వలనే ప్రభుత్వం ఇంకా ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ను టిడిపి కైవసం చేసుకోవడం ఖాయం అని జలీల్ ఖాన్ జోస్యం చెప్పారు.