వీళ్లు పోలీసులు... రౌడీషీటర్ల? : నారా లోకేష్ మండిపాటు

మంగళవారం, 8 మార్చి 2022 (13:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అస్సలు వీళ్లు పోలీసులా లేక రౌడీషీటర్లా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 
 
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టమే నేరంగా పరిగణించిన శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావును వేధించి ఆత్మహత్య చేసకునేందుకు పోలీసులు కారణమయ్యారంటూ ఆయన ఆరోపించారు. 
 
ఏపీలో వైకాపా అరాచక పాలన సాగుతోందన్నారు. ఈ వైసీపీ అవినీతి అక్రమాలపై పోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిని ఇలా చంపుకుంటూ పోతే రాష్ట్రంలో వైపాకా నేతలు, పోలీసులు మాత్రమే మిగులుతారని అభిప్రాయపడ్డారు. 
 
టీడీపీ కార్యకర్త మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

ఏపీలో ఉన్నది పోలీసులా? వైసీపీ రౌడీషీటర్లకి అనుచరులా? అనే అనుమానాలున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే నేరంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావుని వేధించి బలవన్మరణానికి పాల్పడేలా చేసిన వైసీపీ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.(1/4) pic.twitter.com/HQXHP74Ys5

— Lokesh Nara (@naralokesh) March 8, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు