సీఎం కుర్చీపై మళ్లీ నేనే... మెజారిటీ ఎంతో తెలియదు: చంద్రబాబు

గురువారం, 2 మే 2019 (14:43 IST)
ఎన్నికల ఫలితాల విడుదల సమయం ఆసన్నమయ్యేకొద్దీ నాయకుల్లో టెన్షన్ విపరీతంగా పెరిగిపోతోంది. ఐతే ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు మాత్రం చాలా కూల్‌గా సమాధానాలు చెప్పేస్తున్నారు. ఈసారి ముఖ్యమంత్రి కుర్చీపైన తనే కూర్చుంటానని వెల్లడించారు. ఐతే మెజారిటీ ఎంతనదే తేలాల్సి వుందన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూటికి నూరు శాతం ప్రభుత్వం మనదే. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. నా 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెపుతున్నాను. ప్రజలంతా తెదేపా వైపే వున్నారు. అందరూ తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు. అన్ని నివేదికలు పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్ని చెపుతున్నాను. 
 
ఈ లెక్కలు మిగిలిన పార్టీలకు కూడా తెలియడంతో వాళ్లిప్పుడు తమ గొంతులను మార్చుకుంటున్నారు. తెరాస కూడా అంతకుముందు మాట్లాడినవిధంగా ఇప్పుడు మాట్లాడటంలేదు అని అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన తెదేపా నాయకులు, సేవామిత్రలు, బూత్ స్థాయి కన్వీనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పైవిధంగా చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు