సినిమా హీరోయిన్లను చూసేందుకు అభిమానులు ఎంతగా ఉత్సాహం చూపుతారో చెప్పక్కర్లేదు. శనివారం నాడు గుంటూరులో ఇదే అభిమానం ఓ యువకుడి ప్రాణం తీసింది. అంతా చూస్తుండగానే అతడు సజీవ దహనమయ్యాడు. వివరాల్లోకి వెళితే... సినీ నటి రెజీనా శనివారం నాడు గుంటూరు నగరంలో నీరూస్ షోరూం ప్రారంభానికి వస్తుందని తెలిసి అక్కడికి పెద్దఎత్తున యువకులు చేరుకున్నారు.
ఆ షోరూం ప్రక్కనే పెద్ద ఫ్లెక్సీని కూడా పెట్టారు. యువకులంతా ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో కొద్దిపాటి తోపులాట మొదలైంది. ఈ క్రమంలో విజయ్ అనే యువకుడు షోరూం ప్రక్కనే వున్న ఫ్లెక్సీని పట్టుకున్నాడు. ఆ ఫ్లెక్సీ ప్రక్కనే వున్న ట్రాన్సఫార్మర్‌కు తగులుకోవడంతో విజయ్‌కు షాక్ కొట్టింది. దాంతో అతడు కిందపడిపోయాడు.