ఈ నేపథ్యంలో అమ్మాయి రెండు రోజుల క్రితం అదృశ్యమైంది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. గురువారం ఉదయం జడ్చర్ల మండలం శంకరాయపల్లి దగ్గర విద్యార్థిని మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని స్థానిక ప్రభుత్వ అస్పత్రికి తరలించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.