నారాయణ, చైతన్య కాలేజీలపై కొరఢా... రోజుకు రూ.లక్ష జరిమానా

బుధవారం, 30 అక్టోబరు 2019 (13:51 IST)
దసరా, దీపావళి పండుగ రోజుల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించిన శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలపై తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కొరఢా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించినందుకుగాను రోజుకు లక్ష రూపాయలు చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ ఆదేశాలు జారీ చేశారు. 
 
తరగతులు నిర్వహించిన ఒక్కో రోజుకు రూ.లక్ష చొప్పున చెల్లించాలని ఆదేశించారు. సుమారు 50 కాలేజీలు సెలవుల్లో తరగతులు నిర్వహించినట్లు గుర్తించారు. వాటిలో సుమారు 47 కాలేజీలు శ్రీచైతన్య, నారాయణ కాలేజీలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. 
 
నోటీసులు జారీ చేసిన బోర్డు... నవంబరు 2లోగా జరిమానా చెల్లించాలని, లేని పక్షంలో కాలేజీ గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది. దీంతో బోర్డు ఉన్నతాధికారులతో చర్చించేందుకు కాలేజీల యాజమాన్యాలు మంగళవారం ఇంటర్‌ బోర్డుకు క్యూ కట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు