ఓర్నీ... ఆంధ్రోళ్లను అరెస్టు చేస్తారా? ఏంది?

శనివారం, 29 జూన్ 2019 (12:25 IST)
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వేదికగా సమావేశయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్. జగన్ మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. అలాగే, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో పాటు.. కీలక అధికారులు, సలహాదారులు కూడా హాజరయ్యారు. 
 
ఈ సమావేశం ఆద్యంతం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు. దాదాపు సమావేశం ముగింపు దశకు వచ్చేసరికి 'అధికారుల తదుపరి భేటీ ఎప్పుడు?' అంటూ తమ సీఎస్‌ జోషీని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. దీనిపై జోషి స్పందిస్తూ 'వెంటనే భేటీ అవుతాం సార్‌... ఎందుకంటే ఈ ఆంధ్రావాళ్లు (అధికారులు) వెళితే మళ్లీ దొరకరు' అంటూ సరదాగా అన్నారు.
 
దీనికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ, 'ఓర్నీ...ఆంధ్రోళ్లను అరెస్టు చేస్తారా? ఏంది?' అంటూ నవ్వుతూ అనడంతో, 'అవసరం అయితే అరెస్టు చేయడమే' అంటూ జోషి చమర్కరించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు. ఈ సందర్భంలో ఏపీ సీఎం జగన్‌ జోక్యం చేసుకుని 'మంచి కోసం అరెస్టు చేసినా ఫర్వాలేదు' అంటూ కౌంటర్ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు