వైఎస్ జగన్‌తో కేసీఆర్‌కి ఎలాంటి విభేదాలు లేవు. కానీ మున్ముందు ఎలాంటి సమస్యలూ రాకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సంప్రదాయబద్ధంగా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా కేసీఆర్‌ను పిలిచారు. ఈ పిలుపు ద్వారా తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వైరుధ్యాలకు జగన్ ప్రమాణ స్వీకారోత్సవం చెక్ పెట్టే ఛాన్సుందని విశ్లేషకులు అంటున్నారు.
కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. అయితే ఆ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓడిపోవడంతో కేసీఆర్ పైచేయి సాధించినట్లైంది. అప్పట్లో చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్, తాజాగా చంద్రబాబు ఓడిపోవడంతో మాట నెగ్గించుకున్నట్లైంది.