అలాగే ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రకటించిన నవరత్నాల హామీలు ఆ పార్టీకి గెలుపును సంపాదించిపెట్టాయి. ఇంకా అమరావతి రాజధాని నిర్మాణంలో రియల్ ఎస్టేట్ బిజినెస్, అవినీతి, ఇర్రిగేషన్ ప్రాజెక్టులు, ఇంకా ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వంటివి జగన్‌ను గెలిపించాయి. చంద్రబాబు హామీలను నెరవేర్చకపోవడంతో ఓటర్లు జగన్ ప్రకటించిన పథకాలపై ఆకర్షితులయ్యారు.
ఈ సందర్భంగానే నవరత్నాలు అనే పేరిట తొమ్మిది హామీలు ఇచ్చారు. ఈ నవరత్న పథకాలను జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. రైతుల పథకాలు, వయో ఫించన్లు, ఆరోగ్య బీమా, విద్యార్థులకు భారీ ఫీజు రీయింబర్స్‌మెంట్స్, పేద ప్రజలు ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ కారణాల వల్లే జగన్ రెడ్డి ఏపీలో అత్యధిక సీట్లతో ముందంజలో వున్నారు.