ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చెస్తున్నారు : జగన్‌కు హైకోర్టు నోటీసులు

గురువారం, 9 నవంబరు 2023 (14:38 IST)
సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితుడైన జగన్ పిటిషన్లపై పిటిషన్లు విచారణను కావాలనే జాప్యం చేస్తున్నారని జనసేన పార్టీ హరిరామజోగయ్య తన వ్యాజ్యంలో వివరించారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం సీఎం అయ్యారన్నారు. 
 
తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టవిరుద్ధంగా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు కల్పించారని, అందుకు ప్రతిఫలంగా జగన్‌కు చెందిన సాక్షి, భారతి సిమెంట్స్, సండూర్ పవర్ తదితర ప్రాజెక్టుల్లో లబ్ధిదారులు... ముడుపులను పెట్టుబడుల రూపంలో పెట్టారని సీబీఐ అభియోగపత్రాలు దాఖలు చేసిందని పేర్కొన్నారు. 
 
హరిరామజోగయ్య పిటిషన్‌లో ప్రజాప్రయోజనం లేదని, విచారణార్హతపై రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ధర్మాసనం ముందుకు విచారణకొచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌ కుమార్ కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ అభ్యంతరాలపై అదనప అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలిపారు. 
 
జగన్ అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ కోర్టులో ఉన్న కేసులు, అవి ఏ దశలో ఉన్నాయనే వివరాలను అందులో పేర్కొన్నట్లు చెప్పారు. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను సత్వరం చేపట్టేలా కోర్టుకు ఆదేశాలివ్వాలని కోరినట్లు తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. రిజిస్ట్రీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ హరిరామ జోగయ్య పిటిషన్‌కు నంబరు కేటాయించాలని ఆదేశాలిచ్చింది. ప్రతివాదులైన జగన్ కు, సీబీఐకి నోటీసులిస్తూ విచారణను వాయిదా వేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు