నగదు నేరుగా లబ్ధిదారులకు అందడం వల్ల సర్కారుపై చెడ్డపేరు తొలగిపోతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సబ్సిడీ బియ్యంపై ప్రభుత్వం కిలోకు రూ.25 భారం భరిస్తోంది. రేషన్ షాపులు రద్దు చేస్తే, కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి రూ.150 చొప్పున ఆ కుటుంబంలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంత మందికీ ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పర్యవసానంగా కాస్త, అటూ ఇటుగా ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయల వరకు అందే అవకాశం ఉంది.