మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా పాఠశాల విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్‌ను ఖరారు చేసింది.
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించనున్నందున పని దినాలు, బోధన, పరీక్ష లకు సంబంధించిన షెడ్యూల్ తదితర అంశాలతో ప్రతిపాదిత క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది.
కరోనా కారణంగా 11 ప్రశ్నపత్రా లకు బదులు ఈసారి 6 ప్రశ్నపత్రాలతోనే పరీక్షలను నిర్వహించనుంది. ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.