తరగతి గదిలోనే విద్యార్థినిపై అత్యాచారం, నిందితుడు మైనర్ బాలుడు

మంగళవారం, 20 అక్టోబరు 2020 (16:29 IST)
9,10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తరగతులను నడుపుతున్నారు. తల్లిదండ్రుల ఆమోదంతోనే ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు కాకుండా నేరుగా తరగతులను చెబుతున్నారు. అయితే ఈ క్లాసులు ఆ విద్యార్థిని పాలిట శాపంగా మారింది. నమ్మిన వ్యక్తే అతి దారుణంగా మోసం చేశాడు. అత్యాచారం చేసి పరారయ్యాడు. 
 
చిత్తూరులోని ఓ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్‌కు వెళ్ళింది. విద్యార్థికి బంధువు, మైనర్ బాలుడు గత కొన్నిరోజుల నుంచి ఆమె చుట్టూ తిరుగుతున్నాడు. ప్రేమ పేరుతో ఆ విద్యార్థినికి దగ్గరయ్యాడు. అయితే ఎప్పటిలాగా స్కూలుకు రావడంతో ఆ విద్యార్థిని కూడా అతనితో కలిసి మాట్లాడుతూ కూర్చుంది.
 
అయితే ఉన్నట్లుండి ఆ మైనర్ బాలుడు మృగాడిలా మారిపోయాడు. విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే స్కూలు ఉండడం..తన కుమార్తె ఇంటికి రాకపోవడంతో తండ్రి స్కూలు వద్దకు వెళ్ళాడు. అప్పటికే అత్యాచారం చేసిన మైనర్ బాలుడు అక్కడి నుంచి పరారవుతూ కనిపించాడు. 
 
దీంతో కుమార్తెతో పాటు వెళ్ళి ఒన్ టౌన్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు