రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసిన మాజీ మంత్రి ఎన. రఘువీరారెడ్డి స్వగ్రామంలో హాయిగా కాలక్షేపం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన గురువారం యువకులతో కలసి క్రికెట్ ఆడారు.
అనంతపురం జిల్లా నీలకంఠాపురం ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే క్రికెట్ ఆటను రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఈ క్రికెట్లో రఘువీరారెడ్డి బ్యాటింగ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, అందరూ క్రీడా స్ఫూర్తిని చాటాలని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా బాగా రాణించాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో గంగులవాయిపాళ్యం, గోవిందాపురం సర్పంచులు కళావతి, అనితా లక్ష్మీ, మాజీ మార్కెట్‌యార్డు ఛైర్మన నరసింహమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.