కోడూరు మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఈ నెల 3న నూతన సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యాలయంలో ఉన్న సచివాలయ సిబ్బంది టేబుళ్లను బయట పెట్టారు. ప్రమాణ స్వీకారం జరిగి మూడు రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు కూడా ఆ ఫర్నిచర్‌ని పట్టించుకునే నాధుడే లేకపోయాడు.