చరిత్రకారుల ఊహలకు అందని కాలానికే మనదేశంలో వేదాలు వ్యాప్తిలో ఉన్నాయని, వేదాలు భారతీయ వైజ్ఞానికతకు, సంస్కృతికి ప్రతిబింబాలని విఖ్యాత వేదపండితులు స్వాధ్యాయ రత్న బ్రహ్మశ్రీ విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాఠి అన్నారు.
సమాజ సభ్యుడిగా మనిషి ఎలా జీవించాలో, సమాజ వ్యవస్థ సజావుగా సాగటానికి ఎలాంటి పద్ధతులు అనుసరించాలో కూడా వేదాలు చెబుతాయన్నారు. నారాయణేంద్ర సరస్వతీ స్వామి అనుగ్రహభాషణం చేస్తూ వేదాలు వినిపించే ప్రాంతమంతా సశ్యశ్యామలంగా ఉంటుందన్నారు.
వేదాలు పరమేశ్వర స్వరూపమని, వేద మంత్రాలను అనుష్ఠానం చేయటం ద్వారా శబ్దస్వరూపమైన పరమేశ్వర శక్తిని ఉపాసన చేసినట్లవుతుందన్నారు. దేవస్థానం ఛైర్మన్ మాగంటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఏటా వైశాఖమాసంలో పరీక్షలు నిర్వహిస్తామని, కోవిడ్ కారణంగా ఈ ఏడాది పరీక్షలు వాయిదావేసి ప్రస్తుతం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.