130 కోట్ల భారతీయుల సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తోంది: కేంద్రమంతి పియూష్ గోయల్

శనివారం, 13 మార్చి 2021 (21:02 IST)
తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి పియూష్ గోయల్. ఆలయం వద్ద టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డిలు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని రంగనాయక మండపంలో కేంద్రమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
 
ఆలయం వెలుపల కేంద్రమంత్రి పియూష్ గోయల్ మీడియాతో మాట్లాడుతూ 130 కోట్ల మంది భారతీయుల సామర్థ్యం ఏమిటో ప్రపంచం చూస్తోందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని.. ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచమంతా వసుదైక కుటుంబంలా భావించి 450 దేశాలకు మెడిసిన్స్‌ను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
 
75 దేశాలకు కరోనా వ్యాక్సిన్ భారత్ నుంచి అందించామన్నారు. స్వీయ నియంత్రణ, ఎల్లవేళలా మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ పరిశుభ్రమైన తిరుమలగా అధికారులు తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. 
 
80 శాతం రైల్వే సేవలు ఇప్పటికే ప్రారంభించామని.. త్వరలో పూర్తిస్థాయిలో రైల్వేసేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్లో పలు అభివృద్థి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని... తిరుపతి ఇతర ప్రాంతాల మధ్య అధికంగా రైళ్ళు నడిచేలా అదనపు ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు కేంద్రమంత్రి పియూష్ గోయల్. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు