ఎమ్మెల్యే రోజా తను జనసేన పార్టీలో చేరుతున్నట్లు కొందరు తెదేపా నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. కొంతమంది తెదేపా నాయకులు చీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటి గాలి వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రధానితో సమావేశమైనప్పుడు ఆయన వైఖరిని విమర్శించారు.