రాజధాని బిల్లుపై నిర్ణయం తీలుసుకునే అధికారం గవర్నర్‌కి లేదని, ఇదే అంశంపై
సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు వేయనున్నట్టు సమాచారం. రాజు మారినప్పుడల్లా రాజధానులు మారవన్న ఆయన కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఎన్నికల కమిషన్ పైన ఏపీ ప్రభుత్వం అనవసరంగా సమయం వృధా చేస్తుందని, కోర్టులు మొట్టికాయలు వేయటం ప్రభుత్వానికి నామోషీ అని అన్నారు.
పోలవరం... కానీ రాజధాని కాని ఏమైనా ముందుకు సాగిందా..? అని ప్రశ్నించిన ఆయన అధికార వికేంద్రీకరణ అంటే... అవసరాల కోసం రాజధానులు పెట్టడం కాదని అన్నారు. రాజధాని విభజన బిల్లుపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. విద్యా వైద్యం రాష్ట్రాల పరిధిలో అంశాలు అయినా... విధాన పరమైన నిర్ణయం కేంద్రం తీసుకుంటుందన్నారు.