1992లో శ్రీవారి దర్శనానికి విచ్చేసిన సమయంలో డిక్లరేషన్ సమర్పించడంతో షరిప్ మతమార్పిడి చేసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే డిక్లరేషన్ సమర్పించని వారిలో సోనియా గాంధీ, అబ్దుల్ కలాం, జైల్ సింగ్, వైయస్ఆర్ వంటి ప్రముఖులు కూడా వున్నారు.
2003 నవంబర్ 20వ తేదిన శ్రీవారిని దర్శించుకున్న నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు. కానీ దర్శనాంతరం విశ్వశాంతిని కాంక్షిస్తూ శ్రీవారికి అర్చన జరిపించాలని మూడు అర్చన టిక్కేట్లు డబ్బును డాలర్ శేషాద్రికి అందజేసారు అబ్దుల్ కలాం. ఇక ఏపి ముఖ్యమంత్రి జగన్ 2009 లోనే శ్రీవారిని దర్శించుకున్నారు.
2012లో దర్శనానికి విచ్చేసిన సమయంలో మాత్రం డిక్లరేషన్ ఇవ్వాలని టిటిడి ఉద్యోగులు జగన్‌ను కోరినా, స్వామి వారిని దర్శించడం తనకు ఇది మొదటిసారి కాదనీ, తన తండ్రి అనేకసార్లు స్వామివారిని దర్శించుకున్నారని, శ్రీవారికి పట్టువస్త్రాలను కూడా సమర్పించారని, డిక్లరేషన్ పైన సంతకం చేయడానికి జగన్ తిరస్కరించారు.