నవంబరు 17, 18వ తేదీల్లో తిరుమల రెండు నడకదారుల మూత, ఎందుకంటే?

మంగళవారం, 16 నవంబరు 2021 (21:03 IST)
రేపు మరియు ఎల్లుండి అనగా నవంబరు 17, 18 వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ రెండు రోజులు తిరుమలకు వెళ్ళే రెండు నడక దారులు (అలిపిరి, శ్రీవారి మెట్టు) తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుంది.
 
భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలకు వెళ్ళే భక్తులు ఈ విషయం గుర్తించి, ఘాట్ రోడ్ ప్రయాణమే సురక్షితమని సూచించడమైనది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు